నరసరావుపేటలో ధర్నా చౌక్ ఏర్పాటుకు ఉత్తర్వులు

పల్నాడు: నరసరావుపేటలో నిరసనలకు తగిన స్థలం లేక ఇబ్బందులు పడుతున్న రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు శుభవార్త తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో గాంధీ పార్కు పక్కన ఖాళీ స్థలాన్ని ధర్నా చౌక్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శాంతియుత నిరసనలకు మార్గం సుగమమైందని నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.