పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడొద్దు: SP

పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడొద్దు: SP

వికారాబాద్ జిల్లాలోని రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా SP స్నేహ మెహ్రా ఆదివారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద జన సమూహాలు ఉండకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుందని, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు SP తెలిపారు.