లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉద్యోగి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉద్యోగి

NTR: విజయవాడలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ చీఫ్ అబ్బవరపు శ్రీనివాస్ ACB అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల బిల్లుల చెల్లింపులో రూ.50 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ కృష్ణంరాజు రూ.25 లక్షలు ఇచ్చాడు. తరువాత మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ACBని ఆశ్రయించాడు. అధికారులు ఉద్యోగిని గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.