కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నిర్మల్: కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా శనివారం ఉదయం 5 గంటలకు 689.6 అడుగుల వద్ద కొనసాగుతున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా 2899 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.