ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు: సీఈవో
SRPT: మోతే మండలంలోని సిరికొండ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సంఘం సీఈఓ అనంత రెడ్డి తెలిపారు. ఇవ్వాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించారు. తక్షణమే రశీదులు జారీ చేస్తూ పారదర్శకంగా కొనసాగిస్తున్నామన్నారు.