దివ్యాంగుల పింఛన్లపై కలెక్టర్‌కు వినతి

దివ్యాంగుల పింఛన్లపై కలెక్టర్‌కు వినతి

BPT: దివ్యాంగుల పింఛన్లు తొలగించకుండా చూడాలని కోరుతూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి బాపట్ల జిల్లా అధ్యక్షుడు నరసింహులు, ఇతర నాయకులు కలెక్టర్ మురళిని బాపట్లలో శనివారం కలిశారు. ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో, సర్టిఫికెట్లు పోవడం, పర్సంటేజీలు తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యాయని వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.