వాడపల్లి వెంకన్న దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా భవాని
W.G: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా పాలకొల్లుకు చెందిన టీడీపీ నాయకురాలు పెండ్యాల భవాని నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భవాని కొన్నేళ్లుగా టీడీపీలో పలు హోదాల్లో సేవలందించారు. తన నియామకం పట్ల భవాని మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.