భారీ వర్షానికి తడిచి ముద్దయిన వరి ధాన్యం

SRD: నారాయణఖేడ్ మండలంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. భయంకరమైన ఈదురు గాలుల వీచాయి. మండలంలోని వెంకటాపూర్ శివారులో వరి ధాన్యం కుప్పలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఆరబోసిన వరి ధాన్యాన్ని మంగళవారం సాయంత్రమే అప్రమత్తమైన రైతులు వరి కుప్పలపై కవర్లు కప్పి ఉంచారు. అయితే భీకర గాలులకు కవర్లు ఎగిరి ధాన్యం తడిచిందని బుధవారం ఉదయం రైతులు తెలిపారు.