సైక్లింగ్లో జాతీయస్థాయికి అంకిత.. కళాశాల సిబ్బంది అభినందన
SDPT: ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని P.అంకిత జాతీయస్థాయి సైక్లింగ్కు ఎంపికైంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆమెను అభినందించారు. తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించినట్లు అంకిత తెలిపింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, అప్పుడే శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు.