చెరువుగట్టుకు పోటెత్తిన భక్తులు

చెరువుగట్టుకు పోటెత్తిన భక్తులు

NLG: చెరువుగట్టు జడల రామలింగేశ్వర ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. పుష్కరిణిలో స్నానం చేసిన భక్తులు దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక మార్గాల ద్వారా దర్శనాలు సజావుగా సాగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో మోహన్ బాబు తెలిపారు.