లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

BPT: అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు లాడ్జిలపై శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రతి గదిని పరిశీలించి, బస చేస్తున్న వారి వివరాలు సేకరించారు. అనుమానితులపై నిఘా పెట్టారు. లాడ్జిల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, బస చేసే వారి ఐడీ వివరాలు నమోదు చేయాలన్నారు.