'రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేక డ్రైలు'
MNCL: ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించి, రహదారులపై బాధ్యతాయుతంగా ప్రయాణించాలని బెల్లంపల్లి రూరల్ CI హనూక్ మంగళవారం సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణించడం ద్వారా ప్రాణాలకు ముప్పు, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారని హెచ్చరించారు.