చిన్నశేష వాహనంపై నారసింహుని గ్రామోత్సవం

GNTR: మంగళగిరి లక్ష్మీ నారసింహుని ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం చిన్నశేషవాహన సేవ నిర్వహించారు. ఉత్సవానికి కైంకర్య పరులుగా మంగళగిరికి చెందిన దేవతి భగవన్నారాయణ వ్యవహరించారు. అర్చకులు అనంత పద్మనాభచార్యులు ఉత్సవ విశిష్టత వివరించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది.