కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ నేత

నంద్యాల: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నంద్యాల ZPTC గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి APCC చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరడం చాలా సంతోషంగా ఉందని గోకుల్ కృష్ణా రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతానని తెలిపారు.