ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ధృవీకరణ పత్రాలు అందజేత
PDPL: ధర్మారం మండలం మేడారం క్లస్టర్ పరిధిలోని మేడారం, శాయంపేట గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవంగా ఎన్నికైన 10 మంది వార్డు సభ్యులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మేడారం పంచాయతీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజేందర్ ఎన్నికైన సభ్యులకు ఈ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడారం పంచాయతీ కార్యదర్శి డి. మౌనిక పాల్గొన్నారు.