జన గణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: అదనపు కలెక్టర్

జన గణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: అదనపు కలెక్టర్

GDWL: జన గణన-2027 ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల IDOCలో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కచ్చితమైన వివరాలను సేకరించాలని, ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.