సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
HYD: కష్ట సమయాల్లో సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఆదుకుంటుందని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్ అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ కోసం అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. త్వరగా సహాయం చెక్కులు మంజూరు చేసేలా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.