'ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి'
NTR: నందిగామ నియోజకవర్గంలోని కీసర, నందిగామ, దాములూరు ప్రాంతాల్లో మునేరు నది వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తుండటం, త్వరలో వేసవి సెలవులు రానుండటంతో విద్యార్థులు నది వద్దకు వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.