శ్రీశైలంలో బయటపడ్డ రాగి రేకులు

NDL: శ్రీశైలంలో బయటపడ్డ రాగి రేకుల్లో ఆసక్తికర శాసనం ఒకటి కనిపించింది. 1456లో హాలీ తోకచుక్క భూమికి చేరితే సంభవించే విపత్తును ఎదుర్కొనేందుకు విజయనగర రాజు మల్లికార్జునుడు శాంతి పూజలు నిర్వహించినట్టు ఇందులో ఉంది. ఈ శాసనం సంస్కృత, దేవనాగరి లిపుల్లో ఉంది. కడప జిల్లా గాలివీడు మండలం పండితుడు లింగ నార్యకు అందించారని ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు.