ట్రాక్టర్ బోల్తా పడి బాలిక మృతి

ట్రాక్టర్ బోల్తా పడి బాలిక మృతి

VKB: ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందిన ఘటన నవాబుపేట గుబ్బడి పతేపూర్‌లో చోటుచేసుకుంది. ట్రాక్టర్‌లో వెళ్తున్న అనూష (15) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. అదే ట్రాక్టర్‌లో వెళ్తున్న మౌనికకు ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలు అయ్యాయి. అనూష, మౌనిక పొలం పనుల కోసం ట్రాక్టర్‌లో వెళ్తుండగా.. మైనర్ అయిన గోపి ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.