విజయనగరం జిల్లాలో పతంజలి కంపెనీ పెడతాం: రాందేవ్

VZM: కొత్తవలస మండలం చినరావుపల్లిలో 172.84 ఎకరాల్లో పతంజలి కంపెనీ ఏర్పాటు చేస్తామని వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా వెల్లడించారు. గురువారం సాయంత్రం కేటాయించిన భూములను తన వ్యాపార భాగస్వామి బాలకృష్ణన్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్ద ఎత్తున ఆహార, ఔషధ తయారీ ప్రొడక్ట్స్ కంపెనీలు త్వరలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని అన్నారు.