VIDEO: 'బోర్డుపై పిచ్చి మొక్కలు తొలగించండి'
ELR: నూజివీడు మండలం బోర్వంచ గ్రామం నుంచి నూజివీడు పట్టణం వైపు వచ్చే ప్రధాన రహదారిలో ఉన్న సూచిక బోర్డు పూర్తిగా పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలతో నిండి ఉంది. కొత్త ప్రాంతం నుంచి వచ్చే వాహన చోదకులకు రహదారి సూచిక తెలియక ప్రధానమైన రోడ్డులోకి వస్తే పెను ప్రమాదం సంభవిస్తుందని స్థానికులు తెలిపారు. పిచ్చి మొక్కలు తొలగించి, ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరారు.