నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలి

NDL: జిల్లాలోని 29 మండలాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నంద్యాలలోని నర్సింహయ్య భవనం నందు సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఇంటి స్థలాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.