నల్లాకు మోటారు పెడితే జైలుకే

నల్లాకు మోటారు పెడితే జైలుకే

TG: హైదరాబాద్‌లో నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. మోటార్ల వల్ల ఇతరులకు నీరు అందడం లేదని అధికారులు తనిఖీలు చేపట్టి, ఇప్పటికే పలు మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. రెండోసారి పట్టుబడితే ఐదు వేల జరిమానా, కేసు నమోదు చేస్తామన్నారు. నీటి సమస్య ఉంటే 155313 నంబరుకు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.