'తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి'

KMR: అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆర్డివో వీణ అధికారులను ఆదేశించారు. బుధవారం బిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో MRO శివప్రసాద్, సొసైటీ ఛైర్మన్ రాజ గౌడ్ ఉన్నారు.