VIDEO: గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో ప్రమాదం
GNTR: గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు విజయ్ డిజిటల్ సమీపంలో సోమవారం బైక్ రోడ్డు డివైడర్ను ఢీకొని ప్రమాదం జరిగింది. బైక్ పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు వారి బాబు కూడా ఈ సంఘటనలో గాయాల పాలయ్యారు. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో స్థానికులు ఆటోలో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.