కబ్జా రాయుళ్ళపై పోలీసుల నిఘా
వరంగల్ ట్రై సిటీలో భూకబ్జాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు,వారి అనుచరుల జాబితాను వరంగల్ పోలీసులు తయారు చేశారు. 360 మంది పేర్లతో కూడిన జాబితాను పరిశీలించి దాని నుండి 150 మందితో తుది జాబితాను రూపొందించింది. వారిపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. ప్రధాన నేతల అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ జాబితా సిద్ధం చేశారు.