పుంగనూరులో ఘనంగా ఎలక్ట్రిషన్ డే వేడుకలు
CTR: పుంగనూరు మండల కేంద్రంలో మంగళవారం జాతీయ ఎలక్ట్రిషన్ డే వేడుకను ప్రైవేట్ ఎలక్ట్రిషన్స్ వారు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విద్యుత్ శాఖ DE శ్రీనివాసులు హాజరయ్యారు. బల్బును కనుగొన్న థామస్ అల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఎలక్ట్రిషన్ సంఘం జెండాను ఎగురవేసి ఎలక్ట్రిషన్ డే శుభాకాంక్షలు తెలిపారు.