డీసీఎం ఢీకొని.. వ్యక్తి స్పాట్ డెడ్
NLG: దేవరకొండ పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ బుడ్డతండకు చెందిన మూడవత్ రమేష్ అనే వ్యక్తి రోడ్డు పక్కన నిద్రిస్తుండగా వేగంగ వస్తున్న డీసీఎం అదుపుతప్పి అతడి పైకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మృతుడి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.