‘విశ్వవిద్యాలయం VCపై తప్పుడు ప్రచారం వద్దు'

‘విశ్వవిద్యాలయం VCపై తప్పుడు ప్రచారం వద్దు'

KNR: విశ్వవిద్యాలయం, ఉపకులపతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను శాతవాహన యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ (SUCTA) తీవ్రంగా ఖండించింది. కన్వీనర్ డా. జోసెఫ్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుత ఉపకులపతి ఉమేష్ నాయకత్వంలో SU అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. కుల, మత వివక్ష లేకుండా విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని అన్నారు.