శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ
KRNL: శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల కట్టడిపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.