మున్సిపాలిటీలో స్వచ్చంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అబిడ్స్ సెంటర్లో శనివారం స్వచ్చంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి పరిశుభ్రతపై ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మున్సిపాలిటీ ఆదర్శంగా నిలపాలన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.