ఎన్టీఆర్ జిల్లా డీఈవోగా ఎల్ చంద్రకళ
NTR: విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ డీఈవోల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా డీఈవోగా ఎల్. చంద్రకళను నియమించింది. అలాగే కృష్ణా జిల్లా డీఈవోగా యూ.వీ. సుబ్బారావును బదిలీ చేశారు. పరిపాలనా సమర్థతను పెంచడం, విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కొత్త డీఈవోలు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.