చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్

చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్

KMRD: గత నెల 20న ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ పట్టణ సీఐ అశోక్ తెలిపారు. బాన్సువాడ పట్టణంలో సోమవారం సాయంత్రం సీఐ వివరాలు వెల్లడించారు. గాంధీ చౌక్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని విచారించగా చోరీ విషయం బయటపడిందన్నారు. ఆరు తులాల బంగారం, 86 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.