YCP జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొర్లె రవి ఎంపిక
VZM: వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలానికి చెందిన గొర్లె రవిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం జామి మండల YCP అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన గొర్లె రవికి YCP నాయకులు అప్పన సుబ్రహ్మణ్యం, కిలారి సూర్యారావు, పండ్రంకి సంజీవి, సూరిబాబు, శేషు, ఎంపీపీ ఎస్. అరుణ అభినందనలు తెలిపారు.