'ప్రతి ఒక్కరూ సామాజికంగా రాజకీయంగా ఎదగాలి'

KNR: ప్రతి ఒక్కరూ సామాజికంగా రాజకీయంగా ఎదగాలని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలోని కొరుట్ల బస్ స్టాండ్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బహుజనుల ఆకాంక్షకు అనుగుణంగా అందరినీ కలుపుకొని సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం చేశారన్నారు.