VIDEO: అంతర్జాతీయ భూమాత దినోత్సవం.. విద్యార్థుల భారీ ర్యాలీ
SRCL: అంతర్జాతీయ భూమాత దినోత్సవం సందర్భంగా జిల్లెల్ల గ్రామంలో ZPHS విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. భూమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉపాధ్యాయులు, విద్యార్థులు పేర్కొన్నారు. రసాయన ఎరువులు తగ్గించి, ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలని కోరారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో భూమి నివాసయోగ్యం కాకుండా పోతుందని వారు హెచ్చరించారు.