'లేడీ గ్యాంగ్' చోరీలతో వ్యాపారుల ఆందోళన
AP: విజయవాడలో స్థానిక వ్యాపారులను 'లేడీ గ్యాంగ్' చోరీలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చౌకీ సెంటర్ పరిసరాల్లో ఈ గ్యాంగ్ అర్ధరాత్రి పలు దుకాణాల్లో దొంగతనాలు చేసింది. ఆ చోరీలకు సంబంధించిన దృశ్యాలు CC కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ఆ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నారు.