స్పిన్నింగ్ మిల్లులో చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్ట్

స్పిన్నింగ్ మిల్లులో చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్ట్

GNTR: గుంటూరు నగర శివారు చౌడవరం కళ్ళం స్పిన్నింగ్ మిల్లులో చోరీకి పాల్పడిన ఇరువురు యువకులను బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల శారదా కాలనీకి చెందిన మిక్కిలి సందీప్, పఠాన్ మస్తాన్ వలి ఇద్దరూ స్పిన్నింగ్ ఆఫీసులో దాచిన రూ. 5.15 లక్షలు చోరీ చేశారు. వారి నుంచి నగదుతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వంశీధర్ తెలిపారు.