వంట సామగ్రి ఎత్తుకెళ్లిన దొంగలు
KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు ప్రైమరీ స్కూల్లో గుర్తుతెలియని దొంగలు అర్ధరాత్రి వంటగదిలోని సామాన్లను ఎత్తుకెళ్లినట్లు హెచ్ఎం మధుసూదన్ తెలిపారు. తెల్లవారుజామున పాఠశాలకు వచ్చాక తాళం పగలగొట్టి ఉండడంతో లోనికి వెళ్లి చూడగా రెండు గ్యాస్ సిలిండర్లు, వంట సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు హెచ్ఎం పేర్కొన్నారు.