నులిపురుగుల మందులు పంపిణీ చేసిన కార్పొరేటర్

KMM: ఖమ్మం 24వ డివిజన్ శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ASR జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నులిపురుగుల మందులను కార్పోరేటర్ కమర్తపు మురళీ పంపిణీ చేశారు. ఈ మాత్రలు మింగడం వల్ల పిల్లలలో ఉన్న నులిపురుగులు నశించి పిల్లలకు రక్తహీనత రాకుండా కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నాగమణి, హెచ్ఎం క్రిష్ణ కుమారి, కాలేజీ ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.