వృద్ధులకు సౌకర్యాలు కల్పించిన అధికారులు
MDK: నిజాంపేట మండల వ్యాప్తంగా రెండో విడత ఎలక్షన్లు సజావుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు దివ్యాంగులు, వృద్ధులకు వీల్ ఛైర్ ఏర్పాటుచేసి వారి ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు నిజాంపేటలో సుమారు 20% పోలింగ్ జరిగినట్లు సమాచారం. పోలింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.