'స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటును విరమించుకోవాలి'
SKLM: ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటును విరమించుకోవాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని స్థానిక CITU కార్యాలయంలో ప్రజా సంఘాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ల వల్ల వంట కార్మికులు ఉపాధి కోల్పోతారని, ఈ విధానం మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.