PACs అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన హరిబాబు

PLD: నాదెండ్ల గ్రామానికి చెందిన టీడీపీ నేత హరిబాబు నాదెండ్ల PACs అధ్యక్షుడిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా హాజరై, హరిబాబుతో పాటు కమిటీ సభ్యులను ప్రమాణం చేయించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి సమిష్టిగా పనిచేస్తానని హరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.