కవిత ఆరోపణలు సిగ్గుచేటు : మాజీ మంత్రి
WNP: జిల్లా కేంద్రంలో కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం తిప్పికొట్టారు. అసత్య ప్రచారాలను మానుకోవాలని, సత్యాలు ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. తాను సొంత ఖర్చులతో ఎంతో మంది విద్యార్థులను చదివించానని తెలిపారు. పూర్తి విషయ పరిజ్ఞానం లేకుండా దేవుడి మాన్యాన్ని కబ్జా చేశారని ఆరోపించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.