రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి: గ్రంథాలయ ఛైర్మన్

NGKL: భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలు మరవలేనివని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని ఆయన కొనియాడారు.