గుంటూరులో అక్రమ కూరగాయల దుకాణాల తొలగింపు

గుంటూరులో అక్రమ కూరగాయల దుకాణాల తొలగింపు

గుంటూరు జాతీయ రహదారిపై అనధికారికంగా నిర్వహిస్తున్న హోల్‌సేల్ కూరగాయల దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు సోమవారం తొలగించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు, కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ విభాగం ఈ చర్యలు చేపట్టింది. రైతులు తమ కూరగాయలను నిర్ణీత 'కొల్లి శారద హోల్‌సేల్ మార్కెట్'లోనే విక్రయించాలని కమిషనర్ స్పష్టం చేశారు.