మేరికపూడిలో ఉజ్వల యోజన గ్యాస్ పంపిణీ

మేరికపూడిలో ఉజ్వల యోజన గ్యాస్ పంపిణీ

GNTR: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో 35 మంది మహిళలకు బుధవారం ఉచిత గ్యాస్ సిలిండర్‌తో పాటు గ్యాస్ స్టవ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం మండల టీడీపీ అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.