పరిహారం సమానంగా ఇవ్వకపోతే పోరాటమే శరణ్యం
VZM: రైల్వే ఆర్వోబీలు సేకరించిన అన్ని రకాల భూములకు పరిహారం సమానంగా ఇవ్వకపోతే పోరాటమే శరణ్యమని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జి శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం గజపతినగరంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం అన్ని రకాల భూములకు పరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు లక్ష్మీ, సింహాద్రి పాల్గొన్నారు.