రజక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సావిత్రికి మాతృవియోగం
KRNL: ఏపీ రజక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సి. సావిత్రి మాతృమూర్తి లక్ష్మీదేవి (70) మంగళవారం కన్నుమూశారు. పది రోజులుగా కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు సావిత్రి తెలిపారు. వారి నివాసంలో భౌతికకాయానికి బంధువులు, పలువురు నేతలు నివాళులర్పించారు. లక్ష్మీదేవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.